Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ

Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ
- అప్రమత్తంగా ఉండాలి : సిఐ
Rs.4.25 lakhs | నాగోల్, ఆంధ్రప్రభ : ఓ రైతు జేబులో ఉన్న సెల్ఫోను చోరీచేసి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4.25 లక్షలు(Rs.4.25 lakhs) కాజేసిన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తారామతిపేట గ్రామానికి చెందిన దుబ్బా ఐలయ్య (53) రైతు గౌరెల్లిలో ప్రతి మంగళ వారం కూరగాయల సంత ఉండటంతో కూరగాయలు కొనేందుకు వచ్చాడు.
సంతలో రద్దీ ఉండడంతో అతని సెల్ఫోన్ ను చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు అతని కెనరా బ్యాంక్ ఖాతా(Canara Bank Account)లో ఉన్న రూ. 4,25,650 యుపీఐ ద్వారా వేరే ఖాతాల్లోకి పంపించుకున్నారు. విషయం తెలిసిన ఐలయ్య నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్(Mohammed Maqbool) జానీ మాట్లాడుతూ.. సెల్ఫోన్లు చోరీ జరిగిన వెంటనే సిమ్కార్డు తక్షణమే బ్లాక్ చేయించుకోవాలని, ఫోన్ లేకున్నా, సిమ్ పని చేస్తున్నంత వరకు మీ బ్యాంక్ ఓటీపీలు యూపీఐ పిన్ రీసెట్ లింక్ లు సైబర్ నేరగాళ్ల వద్ద ఉంటాయన్నారు. అందుకే తస్మా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
