22గేట్లు ఎత్తి 82,395 క్యూసెక్కుల నీటి విడుదల..

22గేట్లు ఎత్తి 82,395 క్యూసెక్కుల నీటి విడుదల..

మెండోర, సెప్టెంబర్ 13(ఆంధ్రప్రభ) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar Project) కు భారీగా వరద. శనివారం ఉదయం 11గంటలకు ప్రస్తుతం ప్రాజెక్టులోకి 82,395 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు / 332.53 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1091.00 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

శ్రీరాంసాగర్ జలాశయంలోకి శుక్రవారం రాత్రి 30215 వరద రావడంతో జలాశయం 8గేట్లు ఎత్తి దిగువకు 12500 నీటినీ విడుదల చేశామని అధికారులు తెలిపారు. శనివారం ఉద‌యం 12 గంటలకు 42715 ఇన్ ఫ్లో రావడంతో 8గేట్ల ద్వారా 25000, ఇన్ ఫ్లో 67715 పెరగటంతో 1 గంటలకు 16 గేట్లు ఎత్తి 50వేలు, 2గంటలకు 92715 ఇన్ ఫ్లో 23గేట్ల ద్వారా 75 వేలు , ఉదయం 4 గంటలకు 108855 ఇన్ ఫ్లో 23గేట్లు ఎత్తి 91140, ఉదయం 11 గంటలకు ఇన్ ఫ్లో 82,395 22 గేట్లు ఎత్తి 64680 క్యూసెక్కుల నీటిని, వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రాజెక్టు 22గేట్లను ఎత్తి గోదావరిలోకి 64680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా, ఇతర మార్గాల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం అవుట్ ఫ్లో 82,395 క్యూసెక్కులుగా ఉంది.

మెండోర మండలం (Mendora Zone) సావెల్ సమీపంలో కాకతీయ కాలువ లో గుర్తు తెలియని వ్యక్తి పడటంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కాకతీయ కాలువకు నీటి విడుదలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారని, వ్యక్తి ఆచూకీ దొరికే వరకు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు సమాచారం.

ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ కు, లక్ష్మి కాలువ, అలిసాగర్, గుత్పే నీటి విడుదల చేయడం లేదు. అయితే ఇందిరమ్మ కాలువ ద్వారా 8000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్స్ ద్వారా 8000, సరస్వతి 800 క్యూసెక్కులు, మిషన్ భగీరథ (Mission Bhagiratha)కు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.

ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply