Drunk | పోలీసులా మజాకా

Drunk | పోలీసులా మజాకా
- 4గురు మందుబాబులకు రెండేసి రోజుల జైలు
- 17మందికి జరిమానాలు విధించిన మేజిస్ట్రేట్
- హన్మకొండలో డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టుల కొనసాగింపు
- 10మంది మైనర్లు, 9మంది లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారికి జరిమానాలు
Drunk | వరంగల్ క్రైమ్ ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారు. హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన టెస్టులో 21 మంది మందు బాబులు పట్టుబడ్డారు. ఇందులో 4 గురికి రెండేసి రోజుల జైలుశిక్షను మేజిస్ట్రేట్ వేణుగోపాల్ విధించారని ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ సీతారెడ్డి తెలిపారు.
లేబర్ పని చేసుకొనే మామిడి మొగిలి (గంగిరెని గూడెం, శాయంపేట), ప్రయివేట్ జాబ్ చేసే కుంభం క్రాంతి (పలివేల్పుల, హన్మకొండ), లేబర్ వర్క్ చేసే బొంత రవి (మనుబోతుల గడ్డ, ఖానాపూర్), ఆటో డ్రైవర్ మురవని కిరణ్ కుమార్ (రంగంపేట, వరంగల్)లకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. వారిని హుజురాబాద్ సబ్ జైలుకు తరలించారు. మిగిలిన 17 మంది మందుబాబులకు18 వేల 6 వందల రూపాయల జరిమానా విధించారని హన్మకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి పేర్కొన్నారు.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నదువుతూ పట్టుబడ్డ 9 మందికి 5 వేల 4 వందల పెనాల్టీని విధించారన్నారు. పది మంది
మైనర్ బాబులు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ కేసులలో 5 వేల 7 వందల రూపాయల జరిమానా విధించారన్నారు.
