Minister | ప్రతి ఆడబిడ్డకు చీర సారే

Minister | ప్రతి ఆడబిడ్డకు చీర సారే


.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
.. మంత్రి శ్రీధర్ బాబు

Minister | పెద్దపల్లి ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు రాష్ట్ర ప్రభుత్వం చీరతో పాటు సారి అందిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా (Peddapally district) కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం మహిళా సంక్షేమానికి (For women’s welfare) పెద్ద పీట వేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనా అన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తమ పక్షానే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి రామగుండం శాసనసభ్యులు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ లతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply