Narayanpet | ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

Narayanpet | ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
కలెక్టర్ సిక్తాపట్నాయక్
Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Sikta Patnaik) పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారి హక్కుల సంరక్షణలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని ఆమె సూచించారు. మహిళాభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ–జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో బాలల హక్కుల వారోత్సవాల భాగంగా సంతకాల సేకరణ (signatures Collection) కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Sikta Patnaik) స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేసి హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, డీపీఆర్వో ఎం.ఏ.రషీద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. డిసిపివో కరిష్మా, చైల్డ్ హెల్ప్‌లైన్ సమన్వయకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, సఖి సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాలల హక్కుల పరిరక్షణకు తామూ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
