Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు

Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు
Bheemgal | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 21 నుండి శ్రీ చొక్కయాద్రి ( చొక్కయ్య గుట్ట ) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాగ్రి స్వామి (Simhagri Swamy) తెలిపారు. బుధవారం చొక్కయ్య గుట్ట పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు (Ceremonial idols) గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, 22న ఉదయం ప్రాభోదిక, విశ్వక్షేనవిధి, అభిషేకం, ఎదుర్కోలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామి వారికి ఉంజల సేవా, స్వామి కీర్తనలు ఉంటాయి. 23న సత్యనారాయణ వ్రతం, సహస్ర నామ పారాయణం, స్వామి ఉత్సవ మూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడం తో ఉత్సవాలు ముగుస్తాయి. మూడు రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాలలో అన్నప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు కోరారు.
