Rains | నెల్లూరు జిల్లాలో వర్షాలు

Rains | నెల్లూరు జిల్లాలో వర్షాలు

rains | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా (Nellore district) లో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు (Rains) కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అందుకు అనుగుణంగా సోమవారం రాత్రి నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి.

మంగళవారం మధ్యాహ్నానికి జిల్లాలోని కొన్ని మండలాలు మినహాయించి జిల్లా అంతటా వర్షపాతం నమోదైంది. మరోవైపు తుఫాను ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా (Collector Himanshu Shukla) అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో వైపు సముద్రంలో ఎగసి పడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, అలాగే ప్రజలు కార్తీక మాసం అంటూ సముద్ర స్నానాలకు వెళ్ళవద్దని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల కోరారు.

Leave a Reply