Nellikudu : ఒకే నెంబర్ ఇద్దరికి రిజిస్ట్రేషన్..

Nellikudu : ఒకే నెంబర్ ఇద్దరికి రిజిస్ట్రేషన్..

నెల్లికుదురు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని క్రాస్ రోడ్డు వద్ద గల 126 సర్వే నెంబర్ పై కొంత భూమిని రెవిన్యూ అధికారులు ఇద్దరు వేరువేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. వివరాల్లోకి వెళితే గత దశాబ్ద కాలం క్రితం ఆ నెంబర్ పై గల 40 గుంటల భూమిని పెరుమాండ్ల యాదగిరి(Perumandla Yadagiri), ఆకుల అశోక్, గుగులోత్ రాజేష్, వేముల శ్రీనివాసులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

అదే భూమిని తోరూర్ మండలం సన్నూరు గ్రామానికి చెందిన శివరాత్రి ఈశ్వర్(Shivaratri Ishwar) తాను కొనుగోలు చేకున్నానంటూ, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయంటు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఇరు వర్గాలను పంపించారు. విషయానికి సంబంధించి ఆర్ ఐ ధార రామకృష్ణను వివరణ కోరగా సర్వేయర్ వెళ్లి పరిశీలించి వచ్చారని, సరైన రిపోర్ట్ రెండు రోజుల్లో తెలుపుతామన్నారు.

Leave a Reply