Motkur : నేటికీ పూర్తి కాని మరమ్మతులు…
మోత్కూరు, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్(Mini tank bund) కుంగిందని, ఆ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ రోజు టి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బందెల శ్రీనివాస్(Bandela Srinivas) యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… మోత్కూరు – రాజన్న(Motkur – Rajanna) గూడెం గ్రామాల మధ్య గత 3 ఏండ్ల క్రితం 5 కోట్ల 80 లక్షలు రహదారికి నిధులు మంజూరైనప్పటికీ ఆ రోడ్డు మరమ్మతులు నేటికీ పూర్తి కాకపోవడంతో రోడ్లపై గుంతలు ఏర్పడి తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. ఇప్పటికైనా ఈ రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకపోగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

