Pegadapalli | టిప్పర్ ఢీకొని..

Pegadapalli | టిప్పర్ ఢీకొని..

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : టిప్పర్ లారీ (tipper lorry) ఢీకొని ఎనిమిది గొర్రెల మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో చోటుచె సుకుంది. బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి (Pegadapalli) శివారులోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ సమీపంలో టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 8 గొర్రెలు మృతిచెందగా, రెండు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి.

సుల్తానాబాద్ (Sultanabad) నుంచి కాల్వ శ్రీరాంపూర్ వస్తున్న టిప్పర్ లారీ గొర్రెలు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా అతివేగంతో గొర్రెలపై టిప్పర్ వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రూ.1.50లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల యజమాని పల్లపు మల్లయ్య వాపోయాడు.

Leave a Reply