మూతపడిన ఫ్యాక్టరీలో మంటలు..
పఠాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం రూప కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతంలో భయాందోళన చెలరేగింది.
స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మంటలు మరింత విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పోలీసులు కూడా అప్రమత్తమై, సహాయక చర్యలను ప్రారంభించారు. భద్రతా చర్యలలో భాగంగా ప్రజలను ఘటన స్థలం నుంచి దూరంగా తరలించారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
