మొక్కుబడిగా సోయా కొనుగోళ్లు..!

మొక్కుబడిగా సోయా కొనుగోళ్లు..!
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోళ్లు మొక్కుబడిగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఆదిలాబాద్(Adilabad) మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి ప్రారంభించారు.
అయితే తలమడుగు నుండి కరుణాకర్ రెడ్డి, రుయాడి గ్రామానికి చెందిన కృష్ణ కాంత్ ఇద్దరు రైతులు మాత్రమే సోయా సరుకును తీసుకువచ్చారు. క్వింటాలు మద్దతు ద్వారా రూ. 5, 328 చొప్పున కొనుగోలు ప్రారంభించారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి(Utnoor, Indravelli)లోను రైతులకు సమాచారం లేకుండానే హడావుడిగా సోయా కొనుగోలు ప్రారంభించడంపై రైతుల నుండి నిరసన వ్యక్తం అయింది.
- బార్ కోడ్ లేకుండానే కొనుగోళ్లు..!
గత పది రోజులుగా రైతుల ఆందోళన నేపథ్యంలో సోయా కొనుగోళ్లకు ముందుకు వచ్చిన మార్క్‌ఫెడ్(Markfed) గుడిహత్నూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభించగా, కేవలం ఇద్దరు రైతులు మాత్రమే తాము తీసుకువచ్చిన 35 క్వింటాళ్ల సోయాబీన్ విక్రయించారు. తీరా కొనుగోళ్లకు ప్రధానంగా వినియోగించే బార్ కోడ్(Bar Code) వ్యవస్థ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.

మార్కెట్‌కు తెచ్చిన పంట ధాన్యం కొనుగోళ్లకు మార్క్ ఫెడ్ పూర్తి ఏర్పాటు చేయకపోవడంపై రైతుల నుండి వ్యతిరేకత వచ్చింది. ఎలాంటి సమాచారం ప్రచారం లేకుండా రహస్యంగా సోయాబీన్(Soybean) కొనుగోలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. అసలే పంట దిగుబడి తగ్గిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం పక్కాగా కొనుగోళ్లు చేయకపోవడం పై సోయా రైతులు అసహనం వ్యక్తం చేశారు.
