గుడుంబా పట్టివేత..
- ఎక్సైజ్ ఎస్ఐ కీలక హెచ్చరిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసిఫాబాద్ రెబ్బెన మండలంలోని జక్కులపల్లి, తుంగెడ(Jakkulapalli, Tungeda) గ్రామాల్లో ఆసిఫాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్(Excise Police Special Drive)లో భాగంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో జక్కులపల్లి గ్రామంలో 25 గుడుంబా ప్యాకెట్లు లభించగా.. తుంగెడ గ్రామంలో 4లీటర్ల నాటు(4 liter Natu) సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని బైండోవర్(Bindover) చేసినట్లు ఆసిఫాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ రమేష్(Excise SI Ramesh) తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేసినా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

