టీటీడీ మాజీ ఛైర్మన్ పై కేసు



( ఆంధ్రప్రభ, తిరుమల ప్రతినిధి): అలిపిరి సమీపంలోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ ప్రచారం జరిగిందని, భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుమల డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు క్రైమ్ నెంబర్: 338/2025 కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply