చౌటుప్పల్‌లో భూ నిర్వాసితుల ధర్నా

చౌటుప్పల్‌లో భూ నిర్వాసితుల ధర్నా
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్నభూములకు బదులు మరోచోట భూములు(Lands) గాని, మార్కెట్ రేటు గాని ఇవ్వాలని డిమాండ్(demand) చేస్తూ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు(BRS, BJP, Commune) పార్టీల నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని, నిబంధనల ప్రకారం ఓ ఆర్ ఆర్(ORR) నుండి 40 కిలోమీటర్లకు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తూ ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Kusukuntla Prabhakar Reddy), పల్లా వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి(Manohar Reddy) తోపాటు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల నాయకులతో పాటు చౌటుప్పల్ పరిసర ప్రాంత భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
