ప్రతిభ చూపితే నగదు ప్రోత్సాహకాలు

మునుగోడు, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తానని డాక్టర్ వక్కంటి కోటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించే విద్యార్థికి రూ.లక్ష, మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.50 వేలు, పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందిస్తానని ప్రకటించారు.

పాఠశాల నుంచి క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఆర్థికంగా అండగా ఉంటానని చెప్పారు. రసాయన శాస్త్రంలో చేసిన సేవలకు లండన్ పార్లమెంట్ నుంచి ఎక్సలెన్స్ అవార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు వెంకట నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ్, ఉపసర్పంచ్ వెదిరె విజేందర్‌రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మొగుదాల శ్యామల, వడ్లమూడి హనుమయ్య, వీరమల్ల సురేష్ గౌడ్, మక్కెన వెంకటేశ్వరరావు, బోయపల్లి నాగమణి, లక్ష్మణ్ గౌడ్, వడ్డేపల్లి దుర్గాప్రసాద్, మక్కెన పద్మ, మొగుదాల శంభు గౌడ్, శంకు శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.