ఉత్తమ ఉద్యోగిగా మమతకు ప్రశంస పత్రం..

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం భూపాలపల్లి అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఇందులో జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మమత ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మమతకు ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన మమతను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.