ఊర్కొండపేట విద్యార్థినులకు డీఎన్ఆర్ ఆర్థిక చేయూత
- బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన ఇద్దరికి రూ.20 వేల సాయం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊర్కొండ మండలం ఊర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థినులకు బాసర ఐఐఐటీలో సీట్లు లభించాయి. ఆర్థికంగా వెనుకబడిన వారి ఉన్నత విద్యకు తోడ్పాటుగా మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ అధ్యక్షుడు ద్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత అందించారు. ఊర్కొండపేటకు చెందిన నౌషీన్ బేగం, సిరిగిరి ఇందులకు శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఉన్నత చదువుల్లో రాణించాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ రహీం, సర్పంచ్ అబ్దుల్ రషీద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్, శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్ మనోహర్ రెడ్డి, నాయకులు వహిదొద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
