పెద్ది స్వప్నను పరామర్శించిన గౌడ సంఘ నాయకులు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎల్కతుర్తి గౌడ సంఘ నాయకులు జనగాని సురేశ్‌ గౌడ్‌, ప్రెస్‌క్లబ్‌ ప్రచార కార్యదర్శి జర్నలిస్ట్‌ ప్రవీణ్‌ అన్నారు. నల్లబెల్లి మండలంలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లిన వారు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మరణం కుటుంబానికే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన త్యాగాలు, ప్రజాసేవ, నిరంతర పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయన సేవలను నర్సంపేట ప్రజలు ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొని స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.