ఆలయాల అభివృద్ధికి కృషి..

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం కడిపికొండలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆలయంలో జరుగుతున్న మూలవిరాట్ విగ్రహ జీర్ణోద్ధరణ పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ అధ్యక్షుడు కర్ర హరీష్‌రెడ్డి, 44వ డివిజన్ అధ్యక్షుడు సదానందం యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, మాజీ డివిజన్ అధ్యక్షుడు సట్ల సదానందం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్, మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంద రమేష్, సీనియర్ నాయకులు కోటేశ్వర్, ఎడ్ల రాజమల్లారెడ్డి, మహిళా నాయకులు నీలం రజిని, ప్రశాంతి, కాయితే కవిత, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.