జైనూర్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు..

  • రోడ్ల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని రోడ్ల పక్కన ఏపుగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను ట్రాక్టర్ సహాయంతో తొలగించినట్లు సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు తెలిపారు.

రోడ్లపై పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కల కారణంగా ప్రజలు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరగకుండా, వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.