దుర్గా మైసమ్మ ఆలయానికి ఎమ్మెల్యే దంపతుల భూమిపూజ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని 8వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ దుర్గా మైసమ్మ దేవాలయ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డా. అనురాధ కలిసి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ దంపతులు మాట్లాడుతూ.. ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణానికి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. దుర్గా మైసమ్మ అమ్మవారి ఆశీస్సులతో అచ్చంపేట ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం కొనసాగిస్తామని తెలిపారు.
