ఆదిత్యుని దర్శించుకున్న యాంకర్ అనసూయ…
శ్రీకాకుళం, ఆగస్టు 13(ఆంధ్రప్రభ): అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని గురువారం ఉదయం టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెను ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.
