Patriot-Missile-Shortage : క్షిపణుల కొరతతో కీవ్ విలవిల. Andhra Prabha Top Sory.
Patriot-Missile-Shortage : క్షిపణుల కొరతతో కీవ్ విలవిల. Andhra Prabha Top Sory.
- రష్యా బాలిస్టిక్ దాడులు ముమ్మరం
- జెలెన్స్కీ ఆందోళన..
- అమెరికా పేట్రియాట్లలో 10 శాతం ఇస్తే చాలట!
- అమెరికా తూచ్
- నాటో.. నో ..నో
- ఉక్రెయిన్ అధిపతి ఉక్కిరిబిక్కిరి
( ఆంధ్రప్రభ, కీవ్)
రష్యా ఖండాంతర క్షిపణి దాడులను అరికట్టడానికి అమెరికా నుండి ఉక్రెయిన్‌కు అత్యవసరంగా అవసరమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులలో పదో వంతు మాత్రమే ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని క్షిపణుల కోసం మిత్రదేశాలతో అస్పష్ట ఒప్పందాలు కుదుర్చుకోవడంలో, లక్షలాది ఫోన్ కాల్స్‌తోనే తన రోజులు గడిచిపోతున్నాయని ఆవేదన వ్చక్తం చేశారు.
Patriot-Missile-Shortage : కనీసం ఐదుశాతం ఇచ్చినా
..
ఇటీవలి వారాల్లో రష్యా బాలిస్టిక్ దాడులు మరింతగా పెరిగాయి, రాజధాని కీవ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్ వద్ద పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు దాదాపు సున్నాగా ఉండటాన్ని మాస్కో అవకాశంగా వాడుకుంటోంది. రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడులన్నింటినీ ఆపడానికి అమెరికా ప్రస్తుత నిల్వల్లో పదో వంతు సరిపోతుందని, అయితే ఐదు శాతం ఉంటే శీతాకాలం గడిచే వరకు ఉక్రెయిన్ను గట్టెక్కించవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభిప్రాయ పడ్డారు. .2025లో ఉన్నదానికంటే ఈ సంవత్సరం రెండున్న రెట్లు తక్కువ ఇంటర్సెప్టర్లు ఉన్నాయి, “గతంలో కంటే రష్యా వద్ద నెలకు రెండు రెట్లు ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.” ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఏప్రిల్ 2022 తర్వాత ఉక్రెయిన్ పౌరులకు జూలై అత్యంత ప్రాణాంతక నెలగా నిలిచింది. ప్రతి రాత్రి దాడులు జరుగుతాయి, నెలకు నాలుగు లేదా ఐదు సార్లు భారీ దాడులు ఎదురవుతాయి… అవి భయంకర రాత్రులు. నిజంగా చాలా దృఢమైనప్పటికీ ఉక్రెయిన్ ప్రజలు. అలసిపోయారు.అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కనీసం 5% పేట్రియాట్ లు అమ్మితే, ఈ శీతాకాలాన్ని తట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడతామని , అమెరికా 10% అమ్మగలిగితే, రష్యన్ల బాలిస్టిక్ క్షిపణులన్నింటినీ నాశనం చేస్తా్ం. తమ దగ్గర కేవలం ఒక శాతమే ఆయుధాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు.
Patriot-Missile-Shortage : ట్రంప్ తూచ్
ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్షిపణుల కొరత ఏర్పడింది. ఈ యుద్ధంలో, ఇరాన్ క్షిపణి తక్కువ ధర డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి డజన్ల కొద్దీ క్షిపణులను అమెరికా గల్ఫ్ దేశాలు ఉపయోగించాయి. ఈ కొరత ఉక్రెయిన్‌పై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది, అక్కడ కొన్ని రాత్రులు మాస్కో రాకెట్ దాడుల నుండి నగరాలు నిస్సహాయంగా కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంటర్సెప్టర్లను సంపాదించడానికి ప్రతిరోజూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఉక్రెయిన్ తన సొంత పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను నిర్మించుకోవడానికి అనుమతిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన నిబద్ధత కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. నాటో అంకారా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, సంక్లిష్ట ఇంటర్సెప్టర్లను స్వయంగా తయారు చేసుకోవడానికి ఉక్రెయిన్‌కు లైసెన్స్ ఇస్తానని చెప్పారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఆలోచనపై తనకు నమ్మకం లేదని అన్నారు. పేట్రియాట్ క్షిపణి వ్యవస్థల తయారీదారులు ఈ ఆలోచనపై చర్చించడానికి తమ అధికారులను కీవ్‌కు పంపారు, కానీ ఫలితాలు అంతుచిక్కకుండానే ఉన్నాయి.
Patriot-Missile-Shortage : వైట్ హౌస్ మౌన రాగం
పేట్రియాట్ సాయం పెంచాలని ఉక్రెయొన్ అధ్యక్షుబు వైట్ హౌస్‌కు నేరుగా ఫోన్ చేస్తూనే ఉన్నారు. పరోక్షంగా మిత్రదేశాల ద్వారా వేడుకుంటున్నారు. ఇంతకీ అమెరికా స్పందన ఏమిటో.. ఆయన బహిర్గతం చేయటం లేదు. ఇక్కడే ఏదో తిరకాసు కనిపిస్తోంది.
ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్ కాల్ మాట్లాడారు. అమెరికా కంపెనీలకు నష్టం కలిగిస్తూ, ప్రపంచ ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతున్న నల్ల సముద్రంలోని రష్యన్ చమురు ఓడరేవుపై దాడులు జరపవద్దని ఉక్రెయిన్ను కోరినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ద్రువీకరించటం లేదు. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా కనిపిస్తున్న ట్రంప్ నేతృత్వంలోని శాంతి ప్రక్రియ కోసం కీవ్ కొత్త ప్రతిపాదనలను కూడా సమర్పించింది. కానీ ఫలితం కనిపించటం లేదు. ఈ స్థితిలో.. శత్రువును నివారించే శక్తి చాలక.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేక ఉక్రెయిన్ ఉక్కరి బిక్కరి అవుతోంది.
