Sensex | లాభాల్లో సెన్సెక్స్.. జోరులో నిఫ్టీ..
24 వేల మార్క్ దాటిన నిఫ్టీ..
బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. సోమవారం నమోదైన భారీ ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68 వద్ద బలపడింది. దీంతో సానుకూల వాతావరణంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
గత సెషన్ ముగింపు 76,835 పాయింట్లతో పోలిస్తే ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం లాభాల్లోకి చేరింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్లు పెరిగి 76,928 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 24,020 వద్ద కొనసాగుతోంది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల మార్క్‌ను అధిగమించింది.
కోఫోర్జ్, లోధా డెవలపర్స్, ఎంఫసిస్, పెర్సిస్టెంట్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. గాడ్ఫ్రే ఫిలిప్స్, సీజీ పవర్, భారత్ ఎలక్ట్రికల్స్, కోల్ ఇండియా, వెర్నోవా టీడీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 76 పాయింట్లు లాభపడింది.
