సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మల్లేశ్వరి, పలువురు కౌన్సిలర్లు, భక్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.