AP | రైతుపై దాడి.. గ్రామస్తుల్లో భయాందోళన..
AP | ఆంధ్రప్రభ, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని లక్ష్మీపురం తాండాలో పొలంలో పనిచేస్తున్న ఓ రైతుపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి.
ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
గ్రామ పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతానికి తరలించి, గ్రామస్తుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
