డోంగ్లి సహకార సంఘం కార్యదర్శికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

డోంగ్లి, ఆంధ్రప్రభ: సహకార శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో డోంగ్లి సహకార సంఘం కార్యదర్శి బాబురావ్ పటేల్ ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు.

జిల్లా సహకార అధికారి (డీసీవో) చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డును అందజేశారు. సహకార రంగంలో అందించిన విశేష సేవలు, రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, వివిధ సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా బాబురావ్ పటేల్ సేవలను స్థానిక నాయకులు, రైతులు అభినందించారు. ఇలాంటి గుర్తింపులు ఇతర ఉద్యోగులకు కూడా స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.