కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..

కేసముద్రం, ఆంధ్రప్రభ : పాలిసెట్-2026 అభ్యర్థులు ఈనెల 08 తేదీ లోపు కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోనీ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ పొందాలని ప్రిన్సిపాల్ ఈగ మల్లికార్జున సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ల కోసం ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీలు: ఏఐ అండ్ఎంఎల్– 6 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ( సిఎస్ఈ) – 6 సీట్లు, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ (ఈఈవి) – 14 సీట్లు, సెమీకండక్టర్ టెక్నాలజీ ( ఎస్సిటి ) – 39 సీట్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్ (ఈఎస్) – 45 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు 8తేదీ లోపు హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.