Dude Movie | కానీ ఈసారి పూర్తిగా కొత్తగా!

Dude Movie | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: తమిళ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ రించి తెలుగులో కొత్త పరిచయం అక్కర్లేదు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డూడ్’ వంటి సినిమాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు.

PRS01 పేరుతో రూపొందించబోయే కొత్త చిత్రాన్ని ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘డూడ్’ చిత్రంలో కలిసి పనిచేసిన టీమ్‌లోని పలువురు ఈ ప్రాజెక్ట్‌లోనూ భాగమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మమతా బైజు నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి మరో ప్రత్యేకత ఏమిటంటే..ప్రదీప్ రంగనాథన్ తనతో కలిసి పనిచేసిన ఆరుగురు అసిస్టెంట్ డైరెక్టర్లకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ‘ది అల్ఫా యూనిట్ (The Alpha Unit)’ పేరుతో ఈ ఆరుగురు డెబ్యూ డైరెక్టర్లు కలిసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతో కొత్త ప్రతిభకు అవకాశం కల్పిస్తూ వారి కలలను నిజం చేసే ప్రయత్నం చేశారు.

దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా యువ దర్శకులను ప్రోత్సహిస్తూ తన టీమ్‌కు అండగా నిలిచిన ప్రదీప్‌ రంగనాథన్‌పై సినీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.