Kazipet | భార్యతో మాట్లాడుతూనే…

Kazipet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యకు వీడియో కాల్ చేస్తూనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతుడిని డాక్యుమెంట్ రైటర్ రాజేశ్ నాయక్ (45)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి భార్యతో గొడవ పడిన రాజేశ్ నాయక్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

అనంతరం భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా? లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.