Nampally | క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో మంటలు
Nampally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటల వల్ల జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
