చౌటుప్పల్ బస్టాండ్‌కు మైక్ సెట్ విరాళం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ఒక మైక్ సెట్‌ను విరాళంగా అందజేసింది. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జి మన్మథ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీ కంట్రోలర్ ఆనందరావు కు మైక్ సెట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ మన్మథ కుమార్ మాట్లాడుతూ… బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు బస్సుల వేళలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా తెలియజేయడానికి ఈ మైక్ సెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సామాజిక బాధ్యతతో స్పందించి మైక్ సెట్‌ను బహుకరించిన ట్రినిటీ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, పాఠశాల చైర్మన్ కే.వీ.బీ. కృష్ణారావు, ఆర్టీసీ సిబ్బంది, పాఠశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
