కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్
చిట్యాల, జూలై 5 (ఆంధ్రప్రభ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో చిట్యాల మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్, ఏరుకొండ రాజేందర్, బుర్ర శ్రీధర్ గౌడ్, సాద మల్లయ్య, దామర రాజు, నోముల నాగరాజు, ఎలేటి రాజు, కంచర్ల కుమారస్వామి, మేడిపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా అల్లం రవీందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ చేపట్టే ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ఇటువంటి చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
