IIIT Hyderabad | ట్రిపుల్ ఐటీలో కలకలం
IIIT Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థి అనిరుధ్ క్యాంపస్‌లోని భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్‌గా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనిరుధ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులను ప్రశ్నిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాద వాతావరణం నెలకొంది.
