భక్తి శ్రద్దలతో వటసావిత్రి వ్రతలు..
చెన్నూర్, ఆంధ్రప్రభ : జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సోమవారం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని మర్రిచెట్టుకు మహిళలు వటసావిత్రి పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు.
పురాణాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున మర్రిచెట్టుకు వటసావిత్రి వ్రతం చేసి పూజలు నిర్వహిస్తే భర్తకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలుగుతాయనే విశ్వాసంతో ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆసుపత్రి పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
