సింగరేణి అధికారుల డిమాండ్లు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. భూపాలపల్లి జీఎం (GM) కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో సోమవారం ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమైందని, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు.
కాగా, పే అప్‌గ్రడేషన్, మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) బకాయిల చెల్లింపు, అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులు తొలిసారిగా సంస్థ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, యాజమాన్యం స్పందించాలని వారు కోరారు. అధికారులు సంస్థకు వెన్నెముకలాంటి వారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఎండీ నజీర్, సమ్మిరెడ్డి, అలీమ్, విక్రమ్, ప్రసాద్, సుస్మిత, మౌనిక, షైనీ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కురిమిళ్ల శ్రీను, సహదేవ్, దేవన్, దాట్ల శ్రీనివాస్, సాంబమూర్తి, వెంకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
