Janwada Couple Suicide |ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఆత్మహత్య..

Janwada Couple Suicide | ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఆత్మహత్య..

ఐదు నెలల పసిబిడ్డ అనాథ

Janwada Couple Suicide | ఆంధ్రప్రభ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలంలోని మోకీల పోలీస్ స్టేషన్ పరిధి జన్వాడ గ్రామం ఆదివారం రాత్రి విషాదంలో మునిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులు, బల సాయి, పద్మ తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కల కలం రేపింది. ఈ ఘటనతో గ్రామమంతా శోకసం ద్రంగా మారింది. బలసాయి, పద్మలు ఒకరినొకరు ప్రేమించుకుని కుటుంబ సభ్యులను ఒప్పించి సుమారు ఏడాదిన్నర క్రితం వివాహం చేసు కున్నారు. పెళ్లి అనంతరం ఆనందంగా సాగుతు న్న వారి జీవితంలో ఐదు నెలల క్రితం ఓ బాబు జన్మించాడు. చిన్నారి రాకతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే, అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు తీసుకోవడం అందరి నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

దంపతులు ఇంట్లో ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న మోకీల పోలీసులు మృతదేహాలను పరిశీలించి, పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దంపతులు ఈ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ప్రేమించి ఒక్కటైన రెండు మనసులు ఇలా ఒకేసారి జీవితానికి ముగింపు పలకడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తల్లిదండ్రుల ప్రేమను సరిగా ఆస్వాదించక ముందే కేవలం ఐదు నెలల వయసున్న చిన్నారి అనాథగా మారడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. జన్వాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.