ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలను వేయించండి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పోలియో నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ, రెండు పోలియో చుక్కలను వేయించాలన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి చౌదరి మాట్లాడుతూ పట్టణంలో 20 పోలియో కేంద్రాలలో 4,340 మంది పిల్లలకు పోలియో చుక్కలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాహితీ, డాక్టర్ వినత, స్టాఫ్ నర్సులు స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త నిమ్మల వెంకటేశులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాకెట్ల, దోపిడి, ఆమిద్యాల, చిన్నముష్టూర్, పెద్దముష్టూర్, ఇంద్రావతి, రాయంపల్లి, వ్యాసాపురం, నెరమెట్ల గ్రామాలలోని పల్స్ పోలియో కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలను వేసినట్లు రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పావని, డాక్టర్ వెంకటేష్ నాయక్ లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లో 14 పోలియో కేంద్రాలలో 3,152 మంది పిల్లలకు పోలియో చుక్కలను వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ వో నాగ రంగయ్య, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ, సూపర్వైజర్లు స్వర్ణలత, శేఖర్, ఏఎన్ఎం ఆశాజ్యోతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
