ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్
ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఐదు సంవత్సరాలు లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియో నివారణ చేపట్టాలని వికారాబాద్ మున్సిపల్ 31 వ వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున గౌడ్, కోరారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 31 వ వార్డు శివరాం నగర్ కాలనీలో ఆయన ఐదు సంవత్సరాలు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశం గా రూపొందించడం కోసం ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలు ఎందుకు సహకరించి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాల గాయత్రి లక్ష్మణ్ నాయకురాలు దుర్గం సబితా మల్లికార్జున గౌడ్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
