ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి..
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేయించి పోలియో మహమ్మారి నుంచి రక్షించాలని డాక్టర్లు సాయిరాం, సంతోషి, ఊట్కూర్ గ్రామ సర్పంచ్ ఎం. రేణుక భరత్, సర్పంచులు కథలప్ప, వాకిటి వెంకటేష్, గాండ్ల నికిత ప్రశాంత్, కొల్లంపల్లి అంజయ్య, విజయలక్ష్మి నరసింహ, ప్రజలకు పిలుపునిచ్చారు.ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు ఒక్క చిన్నారిని కూడా పోలియో చుక్కలకు దూరం చేయకుండా సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి మందు వేయించాలని కోరారు.పోలియో వ్యాధి శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, పల్స్ పోలియో చుక్కల ద్వారా దానిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
