చిట్టినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..

భవానిపురం, ఆంధ్రప్రభ : చిట్టినగర్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థాన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు భవాని పురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.

ఈ నెల 29 వ తేదీ నుంచి జూలై 3 వ తేదీ వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దేవస్థానం తరపున ఎమ్మెల్యే సుజనా చౌదరి ను ఆహ్వానించామన్నారు..