గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి
- మౌళిక సదుపాయాలకు పెద్దపీట
- రూ.40 లక్షలతో అదనపు తరగతి గదులు
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో రూ.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమిక ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభం, రూ. 10 లక్షలతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు 10,01,160 రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణి చేశారు. అనంతరం స్వర్గీయ చింతకుంట సుధాకర్‌రావు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ చీమలపేట గ్రామానికి తన సోదరుడు సుధాకర్ రావు ఎంతోసుపరిచితులని, గ్రామంలో ప్రతి ఇల్లు తెలిసినవాళ్లేనన్నారు. ఆయన మరణానంతరం తాను రాజకీయల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్న తరుణంలో జూలపల్లి, ఎలిగేడు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశానని, చీమలపేట గ్రామా ప్రజలు సుధాకర్ రావుపై ఉన్న ప్రేమతో, తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చె సుకున్నారు. నాడు చీమలపేట గ్రామంలో తాగు నీరు సమస్య ఉండటంతో బోరు వేసి తాగునీటి సమస్య లేకుండా చూశానని, 1997-98 సంవత్సరంలో జన్మభూమి కార్యక్రమంలో పాఠశాల నూతన గదులను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామస్తుల ఆలోచన ప్రకారం 40 లక్షల రూపాయల నిధులతో రెండు అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
తాను శాసనసభ్యుడిగా గెలుపొందిన రెండున్నర సంవత్సరాల్లో చీమలపేట గ్రామంలో దాదాపు కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. రూ.10 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి త్వరలో రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే అంగన్వాడీ భవన రివే ఎర్ కోసం 2 లక్షలు, గ్రామపంచాయతీ రిపేర్ కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. రైతులకు మేలు జరిగితే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓర్వలేక పోతున్నారని, గతంలో ఒక బస్తాకు 10 కిలోల చొప్పున వడ్ల కటింగ్‌లు పెట్టి రైతులను నిండా ముంచిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇల్లు లేని ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఈ నెల 30 నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు లంక స్వామి, ఉపసర్పంచ్ తొంటి మధుకర్, తహసీల్దార్ దత్తు ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు లోక జలపతి రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, పుల్లూరి వేణుగోపాల్ రావు, దారబోయిన నర్సింగ్ యాదవ్, మెతుకు కాంత్తయ్య, సిరికొండ కొంరయ్య, కందుకూరి అంజయ్య, బండి స్వామి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
