పంచాయతీలో సమస్యల పరిష్కారానికి చర్యలు
పంచాయతీలో సమస్యల పరిష్కారానికి చర్యలు
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామల పంచాయతీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గూడమడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు ఉపసర్పంచ్ కరాడే శివాజీ తెలిపారు. పంచాయతీలోని వీధులలో రోడ్లు గుంతల మయంగా మారడంతో గుంతలను మొరంతో పూడ్చేందుకు చేపట్టిన చర్యలను శనివారం వారు పరిశీలించారు. పంచాయతీలో రోడ్డు ల మరమ్మతు గ్రావెల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. పంచాయతీని అభివృద్ధి చేసే దిశలో పనిచేస్తున్నామని ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. అధికారుల,ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రజల సహకారంతో గూడమామడ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
