ఎన్‌హెచ్-65పై ఇద్దరు వలస కార్మికులు మృతి

కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై శ్రీరంగాపురం జంక్షన్ వద్ద ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన శివ (23), రాజేష్ (25)గా ప్రాథమికంగా గుర్తించారు. వీరిద్దరూ కోదాడ పట్టణంలోని రాంరెడ్డిపాలెం రైస్ మిల్లులో వలస కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.