జగన్నాథ ఆలయంలో డిసీపీ ప్రత్యేక పూజలు..
చెన్నూరు, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ తన సతీమణితో కలిసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దామెర మోహనాచార్యులు జగన్నాథ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి డీసీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు డీసీపీ భాస్కర్‌ను శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
