పారామెడికల్ బోర్డు మాజీ, నూతన కార్యదర్శులకు శుభాకాంక్షలు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ పారామెడికల్ బోర్డు కార్యదర్శిగా దాదాపు ఐదేళ్లపాటు సేవలందించిన బోడా ప్రేమ్‌కుమార్ నాయక్ బోర్డును దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని తెలంగాణ పారామెడికల్ బోర్డు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన పదోన్నతిపై ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) రాష్ట్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అసోసియేషన్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా తెలంగాణ పారామెడికల్ బోర్డు నూతన కార్యదర్శిగా బానోతు మంజునాథ్ నాయక్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో పారామెడికల్ విద్యారంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి భార్గవి పారామెడికల్ సెంటర్ నిర్వాహకులు పాల్గొని, మాజీ మరియు నూతన కార్యదర్శులను అభినందించారు.
