Cyberabad EOW | బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్

Cyberabad EOW | బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్

రంగారెడ్డి కోర్టు కీలక ఉత్తర్వులు

Cyberabad EOW | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విధించిన మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని సూచించింది.

అలాగే రూ.20 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తుదారులను సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.