divi vadthya| ఫిదా అవుతున్న నెటిజన్లు

divi vadthya| ఫిదా అవుతున్న నెటిజన్లు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు ‘బిగ్‌బాస్’ షో ద్వారా దగ్గరైన నటి దివి వాద్య మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ లుక్‌, ఆకట్టుకునే ఫోజులతో కనిపించిన దివి చిత్రాలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా చర్చకు దారితీశాయి.

బిగ్‌బాస్ తర్వాత దివి కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ కంటెంట్ ద్వారా కూడా తన ఉనికిని చాటుకుంటోంది.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో దివి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ‘హనీ’, ‘నెపోలియన్ రిటర్న్స్’, ‘ష్..’ చిత్రాలతో పాటు ‘ద్రౌపతి 2’ వంటి ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత దివి కెరీర్ మరింత వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు, అప్‌డేట్లతో అభిమానులకు చేరువగా ఉండే దివి, తన స్టైల్‌, ఆత్మవిశ్వాసం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా విడుదల చేసిన ఫొటోలు కూడా అదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.