క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై వంటి దేశంలోని ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
బుల్లితెరపై కనిపించే మ్యాచ్‌లను ఇప్పుడు తోటి అభిమానులతో కలిసి మల్టీప్లెక్స్ తెరపై చూడవచ్చు. కాగా, ఈ మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌లలో ప్రారంభమయ్యాయి.